చంద్రబాబు కి చిన్న మెదడు చితికింది…! MLA రోజా ఘాటైన విమర్శలు..!!

shakeel mohammad
Created by shakeel mohammad
On Nov 8, 2019
Help Translate This Item

చంద్రబాబు కి చిన్న మెదడు చితికింది…! MLA రోజా ఘాటైన విమర్శలు..!!

Mirchipataka : ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి సెటైర్లు వేశారు. పోయిన ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూసిన చంద్రబాబు చిన్న మెదడు చితికిందని.. పచ్చకామెర్లవాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని, టీడీపీ తీరును దుయ్యబట్టారు.
ఇప్పుడు ఉన్న ఇసుక కొరత కు కారణం చంద్రబాబేనని.. పవన్, చంద్రబాబు కలిసి షో చేస్తున్నారని.. వారి నాటకాలు అందరికీ తెలుసనీ కామెంట్ చేశారు. ఈ లాంగ్ మార్చిలు, రాంగ్ మార్చులు జనాలు నమ్మరని తెలిపారు. అందుకే వారికి పోయిన ఎలక్షన్స్ లో 23 సీట్స్ తో బుద్దిచెప్పారని చెప్పారు.
ఈ ఇసుక సమస్యపై ముఖ్యమంత్రి జగన్ కొత్త పాలసీ ని తీసుకురాబోతున్నారని, కొంచెం ఓపిక ఉండాలని చెప్పారు. వరదల వలెనే ఇసుక సరఫరా నిలిపివేశారని, పరిస్థితి చక్కబడ్డాక వెంటనే అతి తక్కువ ధరకే విడుదల చేస్తామని తెలిపారు.
For More Details Visit Our Site : Mirchi Pataka